ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు…

22
ts

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.