నారా రోహిత్ న్యూ మూవీ లాంచ్‌…

299
Nara Rohith (SVMP) Production No 1 Movie Launched.
- Advertisement -

వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ హీరోగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతునున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 5) జరిగింది. ఎస్.వి.ఎం.పి సంస్థ పతాకంపై బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ స్క్రిప్ట్ ను దర్శకుడు పవన్ కు అందించారు.

Nara Rohith (SVMP) Production No 1 Movie Launched.

ఈ సందర్భంగా నిర్మాతలు బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ లు మాట్లాడుతూ.. “చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగిడుతూ రోహిత్ హీరోగా పవన్ మల్లెల దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ సీనియర్ నటీమణి రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించనున్నారు. “నరసింహ” చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆవిడది. నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటించనుంది, టామ్ బోయ్ తరహా క్యారెక్టర్ ఆమెది. మా చిత్ర ప్రారంభోత్సవానికి వినాయక్, కె.ఎస్.రామారావు, బెల్లంకొండ సురేష్, భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ వంటి చిత్ర ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, శివప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, రవివర్మ, సన, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: నరసింహారావు, మేకప్: శ్రీనివాస్, స్టిల్స్: మణి, గ్రాఫిక్స్: మ్యాట్రిక్స్ వి.ఎఫ్.ఎక్స్, పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను, లిరిక్స్: కె.కె-కృష్ణ చైతన్య, డ్యాన్స్: విజయ్, స్టంట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రవి వేమూరి, లైన్ ప్రొడ్యూసర్: యోగానంద్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, కో-డైరెక్టర్: రామనాథ్ రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, స్టోరీ-డైలాగ్స్: కొలుసు రాజా, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పవన్ మల్లెల!

- Advertisement -