సోనమ్‌లాగే సన్నీ కూడా..!

207
Sunny Leone now becomes an emoji
- Advertisement -

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన నటి సన్నీలియోన్‌. ఈ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. అందుకే ఈ శృంగార తారకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో సన్నీ ఒక శృంగార దేవత. అందుకే ఈమె అందాలు అడ్డు పెట్టుకుని క్యాష్‌ చేసుకోవాలని దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతవరకు సన్నీ నటించిన సినిమాల్లో కథ లేకుండానే మొత్తం ఆరబోతతోనే కథల్ని తెరకెక్కించారంటే అది సన్నీ క్రేజ్. శృంగార దేవతగా ఒక వెలుగువెలుగుతుంది.

Sunny Leone now becomes an emoji

తెరపై బోల్డ్‌గా కనిపించే సన్నీ, వాల్‌ పోస్టర్లపై అమాంతంగా అందాలు పరిచే ఈ సెక్సీబాంబ్‌ సరికొత్తగా కనువిందు చేస్తోంది. ఎమోజీల రూపంలో సోషల్‌ మీడియాలో హావభావాలు ప్రకటించేస్తోంది. ఎమోజీఫి యాప్‌ పార్ట్‌నర్‌గా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎమోజీ స్టిక్కర్స్‌ని విడుదల చేసింది. కూల్‌గా చూస్తూ ఒకటి, కొంటెగా లుక్కిస్తూ మరొకటి, స్ర్టాబెర్రీ కొరుకుతూ ఇంకోటి.. ఇలా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో హాయ్‌ చెబుతోంది సన్నీ.

వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ హ్యాంగవుట్స్‌, హైక్‌ వంటి సోషల్‌ మెసెంజర్లలో ఈ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు నటి సోనమ్‌ కపూర్‌ ఇలాగే ఎమోజీల రూపంలో వచ్చి నెటిజన్లను ఉల్లాసపరిచింది. అదే దారిలో సన్నీ కూడా ఎమోజీకి జై కొట్టింది. అయితే ఆన్‌స్ర్కీన్‌పై చాలా హాట్‌గా లుక్కిచ్చే సన్నీ.. ఎమోజీల దగ్గరికి వచ్చేసరికి చాలా కూల్‌గా కనిపించడం విశేషం

- Advertisement -