డిప్యూటీ సీఎం ప్రచారంపై నారా లోకేశ్

2
- Advertisement -

కొంతకాలంగా టీడీపీ నేతలు నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ కాగా నారా లోకేశ్ సైతం స్పందించారు. ఇది కేవలం రాజకీయ పరమైన కామెంట్ మాత్రమేనని ఇప్పుడు తన దృష్టంతా ఏపీ అభివృద్ధిపైనే ఉందన్నారు.

ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని …తన చేతి నిండా పని ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలని అన్నారు. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలని చెప్పారు. క్యాన్సర్, డయాబెటిక్, రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్ లలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఏపీని హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్‌ తరఫున సహకారం అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:ప్రజాగ్రహం.. గ్రామసభ టెంట్‌ కూల్చివేత

- Advertisement -