నాని చేతుల మీదుగా విజయ్ మూవీ!

6
- Advertisement -

‘హాయ్ నాన్న’ (2023) వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్, తన రెండో ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండతో జతకట్టారు. తాత్కాలికంగా ‘VD x Shouryuv’ అని పిలుస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ కొట్టడం విశేషం.

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రం ఒక రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read:సిక్స్‌లు ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేయను!

‘హాయ్ నాన్న’ నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

- Advertisement -