మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమపై తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం ఆయన భారీ ఆర్థిక సాయం అందించారు.
శివనాథ్ గుండె ఆపరేషన్ కోసం చిరంజీవి రూ. 10.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా, ఆస్పత్రికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే చిరంజీవి మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య భార్య బైపాస్ సర్జరీ కోసం ఆయన రూ. 9.5 లక్షలు విరాళంగా అందజేశారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ సేవా కార్యక్రమాలకు గానూ మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Also Read:సిక్స్‌లు ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేయను!
సినిమాలతోనే కాకుండా, ఆపదలో ఉన్న తోటి సినీ కార్మికులను ఆదుకోవడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి.

