తెలుగు బుల్లితెర రియాలీటి షో బిగ్ బాస్ 2 మరికొద్ది రోజుల్లో మనముందకు రానున్న విషయం తెలిసిందే. గత సిజన్ ఈషోకు యాంకర్ గాఎన్టీఆర్ చేశారు. సెకండ్ సిజన్ కు యాంకర్ హీరో నాని వ్యవహరించనున్నాడనే విషయం తెలిసిందే. ఈవిషయాన్ని అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసి కన్ఫామ్ చేశారు నాని. బిగ్ బాస్ 2 లోగొతోపాటు నాని లుక్ ను ఈపొస్టర్ లో మనం చూడవచ్చు. ఈపొస్టర్ ను తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసి ఓ కామెంట్ చేశాడు నాని. ‘బాబాయ్.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్‌బాస్‌తెలుగు2’ అని చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాని ట్వీట్‌పై స్టార్ మా స్పందించింది. ‘స్టార్ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. ఈషోకు సంబంధించి ప్రోమోను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. గత సిజన్ ను ముంబైలో జరపగా..ఈసిజన్ ను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుపనున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ 2షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాని రెమ్యూనరేషన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాడని తెలుస్తుంది. సిజన్ 1కు ఎన్టీఆర్ రూ.5కోట్లు తీసుకోగా ఇప్పుడు నాని సుమారు రూ. 4కోట్ల వరకూ తీసుకుంటున్నాడని సమచారం. ఇందుకు స్టార్ మా యాజమాన్యం కూడా ఒప్పుకుంది. సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తొలి సిజన్ ను 70రోజులు జరిపిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 2 ను 100నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 10నుంచి రెండవ సిజన్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు స్టార్ మా యాజమన్యం. ఇక ఈసారి కంటెస్ట్ లు కూడా పెరగవచ్చని సమాచారం. నాని హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ 2 ఎంతవరకూ సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.