నంది అవార్డ్స్ 2012 : ఉత్తమ నటుడు నాని, నటి సమంత

196
Nani - Rajamouli for Nandi Awards
- Advertisement -

2012 సంవత్సరానికి గాను  సినీ రంగానికిచ్చే నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  2012 ఉత్త‌మ చిత్రంగా ఈగ, రెండో ఉత్తమ చిత్రంగా మిణుగురులు, మూడో ఉత్త‌మ చిత్రంగా మిథునం సినిమాల‌కు నంది అవార్డులు ల‌భించాయి. ఉత్త‌మ న‌టుడిగా నాని (ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు), ఉత్త‌మ న‌టిగా స‌మంత (ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు), ఉత్త‌మ విల‌న్‌గా సుధీప్‌(ఈగ‌) నిలిచారు. బెస్ట్ లిరిక్స్ రైటర్‌గా అనంత శ్రీ‌రాం ( ఎటోవెళ్లిపోయింది మ‌న‌సు చిత్రంలోని కోటికోటి తార‌ల్లోన చంద‌మామ ఉన్న‌న్నాళ్లు పాట‌కు), మోస్ట్ పాపుల‌ర్ చిత్రంగా జులాయి, బెస్ట్ ఎంట‌ర్‌టైన్ మెంట్ చిత్రంగా ఇష్క్ నిలిచాయి. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.

అవార్డుల వివరాలు

() ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి(ఈగ)
() ఉత్తమ నటుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
() ఉత్తమ  నటి- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
() ఉత్తమ సహాయనటుడు- అజయ్‌(ఇష్క్‌)
() ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
() బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- జులాయి
() ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌
() ఉత్తమ గాయని- గీతామాధురి
() ఉత్తగ సంగీత దర్శకుడు- కీరవాణి, ఇళయరాజా
() రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
() మూడో ఉత్తమ చిత్రం- మిథునం
()ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
()ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
()ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
()ఉత్తమ సంగీత దర్శకుడు :  కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
()ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
()ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
()ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
()ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
()ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
()ఎస్వీ రంగారావు పురస్కారం ఆశిష్ విద్యార్థి

- Advertisement -