- Advertisement -
నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేను లోకల్. శిరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం 2017 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకువచ్చింది.
నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. సచిన్ ఖేడేకర్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, తులసి, ఈశ్వరి రావు తదితరులు నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్న్ని అందించాడు.
తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది.
- Advertisement -