నాని..’అల్లూరి’ ట్రైలర్

32
nani
- Advertisement -

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.

సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న సాయంత్రం 5.04 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

సినిమాలో శ్రీవిష్ణు పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుందని.. ఈ థియేట్రికల్ ట్రైలర్‌లో కేవలం శాంపిల్ మాత్రమే చూస్తారని చిత్ర యూనిట్ అంటోంది.

- Advertisement -