నందమూరి బాలకృష్ణ ..ఈ పేరు వినగానే మాస్ ప్రేకకులు గల్లాలేగిరేస్తారు. టాలీవుడ్‌లో యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నందమూరి నటసింహం. ఈ మధ్యే విడులైన జయసింహా సినిమాతో సక్సెస్‌ను అందుకున్న ఆయన తాజాగా తేజ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు జీవిత కథాంశంతో తెరకెక్కతున్న బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేశాడు బాలయ్య.
ఎన్టీఆర్ బయోపిక్ అనంతరం వీవీ వినాయక్ కాంబినేషన్‌లో ఓ సినిమాను చేయబోతున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అదే కాంబినేషన్ మళ్లీ రిపిట్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. వీవీ వినాయక్ సినిమాలు ఏ రేంజ్‌లో ఉంటాయో మాస్ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. 2002 తర్వాత వినాయక్ మళ్లీ బాలయ్య తో సినిమా చేస్తున్న నేపధ్యంలో సినిమా ఏ రేంజులో తెరకెక్కిస్తారా చూడాలి మరీ. కన్నడ సూపర్ హిట్ మూవీ మఫ్టీ కి రీమేక్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాను సీ కల్యాణ్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సమాచారం.