నాగశౌర్య అమ్మమ్మగారిల్లు.. టీజర్‌

255
- Advertisement -

నాగ‌శౌర్య‌, షామిలి జంట‌గా న‌టించిన చిత్రం ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’. సుమిత్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకి సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్వాజిత్ మూవీస్ ప‌తాకంపై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం మే నెల‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేసింది చిత్ర బృందం. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని.. క‌థానాయ‌కుడికి, అమ్మ‌మ్మ‌కి మ‌ధ్య ఉండే అనుబంధ‌మే ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌ల‌మ‌ని టీజ‌ర్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు ద‌ర్శ‌కుడు.

“Ammammagarillu” Movie Teaser

అనగనగా ఒక పల్లెటూరు. హీరో అమ్మ పుట్టిన ఊరైన అక్కడికి సెలవుల కోసం వెళ్తే తిరిగి రావాలి అనిపించలేనంతగా అక్కడివాళ్ళతో పెనవేసుకుపోతాడు. అమ్మమ్మ గుండెల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని ఆమె కోసం ఏదైనా చేసే మనవడిగా మారతాడు. ఇదీ క్లుప్తంగా అమ్మమ్మగారిల్లు టీజర్ లో చూపించిన కథ. ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణం-స్వచ్చమైన మనసున్న మనుషులు-ఉమ్మడి కుటుంబాల మధ్య అనుబంధాలు ఇవన్ని టాలీవుడ్ కు పరిచయమవుతున్న దర్శకుడు సుందర్ సూర్య బాగానే కవర్ చేసాడు.

ఈ మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీస్ అన్ని మంచి రెస్పాన్స్ దక్కించుకున్న నేపధ్యంలో ఇది కూడా అదే కోవలోకి వచ్చేలా కనిపిస్తోంది అమ్మమ్మగారిల్లు మూవీ. ఇక ఇందులో మరో సర్ప్రైజ్ హీరొయిన్ శామిలి. అప్పుడెప్పుడో సిద్దార్థ్ ఓయ్ సినిమాలో బొద్దుగా కనిపించి మాయమైపోయిన శామిలి మళ్ళి దీని ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇందులో మరో సర్ప్రైజ్ హీరొయిన్ శామిలి. అప్పుడెప్పుడో సిద్దార్థ్ ఓయ్ సినిమాలో బొద్దుగా కనిపించి మాయమైపోయిన శామిలి మళ్ళి ఈ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.

- Advertisement -