కృష్ణాష్టమికి బాలయ్య న్యూ లుక్స్..

207
- Advertisement -

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా కొనసాగుతోంది. కొన్ని రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, హైదరాబాద్ – అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు.

Nandamuri Balakrishna

తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పలువురు ప్రముఖ నటినటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేడు కృష్ణాష్టమి సందర్భంగా `ఎన్టీఆర్` సినిమా నుండి కొత్త లుక్‌ని టీమ్ రిలీజ్ చేసింది. కృష్ణా.. ముకుందా… మురారీ…నందమూరి నందన వన విహారి… కృష్ణాష్టమి శుభాకాంక్షలు!! అంటూ టీమ్ విషెస్ చెప్పింది. ఇక.. చిత్రటీం విడుదల చేసిన కృష్ణా.. ముకుందా… మురారీ, లుక్స్‌తో బాలయ్య ఆకట్టుకుంటున్నాడు.

కాగా..క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి – వారాహి చలనచిత్రం సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -