న‌మిత పెళ్లి డేట్ ఫిక్స్..

168
Namitha to Marry Veerendra
- Advertisement -

సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గుజరాతీ భామ నమిత. తన అందం,నాజూకు తనంతో ఆకట్టుకున్న ఈ భామ జెమిని,సింహా వంటి సినిమాలతో మెప్పించింది. అయితే, టాలీవుడ్‌ కంటే కోలీవుడే నమితకు బ్రహ్మారధం పట్టింది. ముఖ్యంగా తమిళ తంబీలు నమిత నటనకు ఫిదా అయిపోయారు. తమిళనాడులో ఆమెకు గడికూడా కట్టారు.  సీనియర్ నటి ఖుష్బూ తర్వాత అలా గుడికట్టి ఆరాధించిన కథానాయిక నమితనే.

అయితే, ఇటీవల కాలంలో అక్కడ కూడా ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నమితపై రకరకాల పుకార్లు షికార్ చేశాయి. సీనియర్ నటుడు శరత్ బాబుతో హీరోయిన్ నమిత ప్రేమలో ఉన్నట్టు వార్త చక్కర్లు కొట్టింది.. అయితే ఈ వార్తల్లో   నిజం లేదని తేల్చి చెప్పిన  నమిత,  తాజాగా తనకు కాబోయే భర్త ఎవరనే విషయం బయటపెట్టేసింది.

నటుడు వీరాతో తన విహహం ఈ నెల 24న జ‌ర‌గ‌నుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. వీరిద్దరు  క‌లిసి మియా అనే థ్రిల్ల‌ర్ ఫిలింలో  న‌టించారు. ఇక వీరా కూడా త‌న అఫీషియ‌ల్ పేజ్‌లో న‌మిత‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలిపాడు.

- Advertisement -