దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో నీటి అభివృద్ధి..

264
- Advertisement -

రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లోక్‌సభలో లేవనెత్తడంపై టీఆర్ఎస్ ఎంపీలు వారి గళం వినిపించారు.. ఇందులో భాగంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు, తాగు నీటి అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్ర సమస్యలు ఉంటే అసెంబ్లీలో, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడ చర్చించాలి. సభలో రాజకీయాలు చేయకుండా తెలంగాణ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలి. దేశ రాజధానిలోని ఇండియా గేట్ దగ్గరకు బోనాలను తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం సరికాదు.అసెంబ్లీలో ప్రస్తావించాల్సినవి అక్కడ, లోక్ సభలో ప్రస్తావించాల్సినవి ఇక్కడ చేయాలి.

MP Malotha Kavitha

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. మహబూబాబాద్ నియోజకవర్గంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని గుర్తు చేశాం.కేంద్ర ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామని ఆమె అన్నారు.

పెద్దపల్లి ఎంపి నేత వెంకటేశ్ మాట్లాడుతూ.. పోడు వ్యవసాయం చేసే రైతులు, ఆదివాసిల సమస్యలకు కేసీఆర్ ఎన్నో చేస్తున్నారు.పోడు భూముల సమస్యకు 1960లోనే కమిటీ ఆధారంగా నోటిపై చేశారు.రికార్డులు, పరిష్కార మార్గాలు చూపాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కావాల్సిన రికార్డులు, యంత్రాంగం ఇచ్చి పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

- Advertisement -