సాగర్ ఉప ఎన్నికలు…బీసీ ఓటర్లే కీలకం

386
sagar by elections
- Advertisement -

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజీ ఓట్లే కీలకం కానున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 745 ఓటర్లుండగా వీరిలో లక్షా 8 వేల 907 మంది పురుషులు కాగా.. లక్షా ఒక వేయి 838 మంది మహిళా ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి… గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి, మడుగులపల్లి, నిడమనూరు, అనుముల, త్రిపురారం మండలాలున్నాయి.

గుర్రంపొడు మండలంలో మొత్తం 34 వేల 622 మంది ఓటర్లున్నారుండగా పెద్దవూర మండలంలో మొత్తం ఓట్లు 44 వేల 658,తిరుమలగిరి మండలంలో మొత్తం 31 వేల 431 మంది ఓటర్లున్నారు. అనుముల మండలంలో మొత్తం ఓట్లు 33 వేల 753, నిడమనూరు మండలంలో మొత్తం ఓట్లు 34 వేల 214 ఉన్నాయి. మడుగులపల్లి మండలంలోని పది గ్రామాలు సాగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి 7 వేల 225 ఓటర్లుండగా త్రిపురారం మండలంలో మొత్తం 33 వేల 842 మంది ఓటర్లున్నారు.

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. అత్యధికంగా వెనుకబడిన తరగతుల వారి ఓట్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య లక్షా 5 వేల 495 మంది వున్నారు. వీరిలో యాదవ ఓటర్ల సంఖ్య 34 వేల 267. బీసీ ఓటర్లలో రెండో స్థానంలో ముదిరాజుల ఓట్లు 12 వేల 721, మూడో స్థానంలో గౌడ కులస్థుల ఓట్లు 9 వేల 948 వున్నాయి. ఇక ముస్లిం మైనార్టీల ఓట్లు 8 వేల 115, రజక సామాజిక వర్గం ఓట్లు 7 వేల 896, మున్నూరు కాపుల ఓట్లు 6 వేల 515, కమ్మరి, వడ్ల కులస్థులు 5 వేల 328, కుమ్మరులు 5 వేల 258, వడ్డెరలు 5 వేల 557, పద్మశాలీలు 2 వేల 172, పెరిక కులస్థులు 2 వేల 889, నాయీ బ్రాహ్మణులు కులస్థులు 2 వేల 291, బలిజలు 1,164, కంసాలిలు 828, మేర కులస్థులు 546 మంది వున్నారు.

నియోజకవర్గంలో మొత్తం ఎస్సీ ఓటర్ల సంఖ్య 37 వేల 671 మంది కాగా.. వీరిలో మాదిగలు 26 వేల 204, మాలలు 9 వేల 698, బైండ్ల కులస్థులు 617, దాసరులు 669, బుడగ జంగాలు 483 మంది వున్నారు. ఇక ఎస్టీల సంఖ్య 40 వేల 398 కాగా.. అందులో లంబాడీలు 38 వేల 332 మంది, ఎరుకలులు 2వేల 66 మంది వున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓసీ ఓటర్ల సంఖ్య 31 వేల 385 కాగా.. ఇందులో రెడ్లు అధికంగా వున్నారు. వీరి సంఖ్య 23 వేల 472 మంది రెడ్డి కులస్థులున్నారు. వైశ్యులు 3 వేల 517 మంది, కమ్మ కులస్థులు 2 వేల 736 మంది, వెలమలు పన్నెండు వందల 72 మంది, బ్రాహ్మణులు 334 మంది, కరణాలు154 మంది ఉన్నారు.

- Advertisement -