హ్యాండ్ ఇచ్చినా ఛాన్స్ ఇచ్చాడు

148
- Advertisement -

అప్పుడెప్పుడో ఏడేళ్ల కిందట అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత నాగార్జున చాలా పుట్టినరోజులు జరుపుకున్నారు, కానీ నాగ్ – శ్రీనువైట్ల సినిమా మాత్రం సెట్స్ పైకి రాలేదు. దీనికి కారణం.. శ్రీనువైట్ల ఫామ్ లో లేకపోవడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీనువైట్ల – నాగార్జున కలయికలో కింగ్ సినిమా వచ్చింది. మంచి విజయం సాధించింది. ఆ సమయంలోనే నాగార్జున మరో సినిమా కలిసి చేద్దాం అంటూ శ్రీనువైట్లతో అన్నాడు.

అటు శ్రీనువైట్ల కూడా సరే అంటూ తలూపాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో దూకుడు సినిమా చేయడం, అదీ కాస్త ఇండస్ట్రీ హిట్ అవ్వడం.. మొత్తానికి శ్రీనువైట్ల రేంజ్ మారిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో దూకుడు సినిమా వెంటనే శ్రీనువైట్లకు నాగార్జున కబురు పంపాడు. కానీ మరోవైపు ఎన్టీఆర్ నుంచి పిలుపు. దాంతో శ్రీనువైట్ల ఎన్టీఆర్ తో బాద్షా అంటూ ఓ యాక్షన్ డ్రామా చేశాడు. ఆ తర్వాత కూడా శ్రీనువైట్ల నాగార్జునతో సినిమా చేయడానికి టైమ్ ఇవ్వలేకపోయాడు. మొత్తానికి స్టార్ డైరెక్టర్ నుంచి ప్లాప్ డైరెక్టర్ గా పడిపోయాక గానీ, శ్రీనువైట్లకు నాగార్జున ప్రాజెక్ట్ గుర్తుకు రాలేదు.

దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి మంచి హీరో డేట్స్ కోసం శ్రీనువైట్ల ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనువైట్లకు నాగార్జున ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంచి ఎంటర్ టైన్మెంట్ కథ ఉంటే తీసుకురా అంటూ నాగార్జున, శ్రీనువైట్లకు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది సమ్మర్ తర్వాత శ్రీనువైట్ల – నాగార్జున సినిమా స్టార్ట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి…

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రగతి..

‘పుష్ప 2’ పై సందేహాలు

ఆ సినిమాలపై ‘శాకుంతలం’ ఎఫెక్ట్ ?

- Advertisement -