‘పుష్ప 2’ పై సందేహాలు

24
- Advertisement -

అసలు పుష్ప 2 ‘ థియేటర్స్ లోకి వచ్చే దెప్పుడు ? ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ అందరిలోనూ ఉన్న ప్రశ్న ఇది. ఇప్పటి వరకూ పది రోజుల ఘాట్ కూడా జరగలేదు. పుష్ప 1 వచ్చి ఏడాది అవుతున్నా సుక్కు ఇంకా పుష్ప 2 షూటింగ్ నత్త నడకన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మైత్రి టీం పై భారీ ఒత్తిడి తెస్తున్నారు.

నిజానికి సుకుమార్ ప్రతీ సినిమా మేకింగ్ కి చాలా టైమ్ తీసుకుంటాడు. ఏడాదిన్నర పైనే సినిమాను చెక్కుతాడు. మరి ఈ నేపథ్యంలో పుష్ప 2 కి ఎంత టైమ్ తీసుకుంటాడు ? అసలు ఈ ఏడాది సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది రావడం కష్టమే అనిపిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుందని అంటున్నారు. మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ సుకుమార్ ఈ సీక్వెల్ ను నెలల్లో తీసి ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయడం మాత్రం కష్టమే.

ఒక వేల ఈ ఏడాది కనుక పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకపోతే బన్నీ కి రెండేళ్ళ గ్యాప్ వచ్చినట్టే. ఒక స్టార్ హీరో నుండి రెండేళ్ళు సినిమా రాకపోతే వారి ఫ్యాన్స్ నిరాశ అంతా ఇంత కాదు.

ఇవి కూడా చదవండి…

ఆ సినిమాలపై ‘శాకుంతలం’ ఎఫెక్ట్ ?

ఆ ఆసక్తి లేదంటున్న హీరోయిన్ !

‘వారసుడు’ చూసిన రామ్ చరణ్ ?

- Advertisement -