నాగ్‌-ధనుష్ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్‌..

228
Nagarjuna
- Advertisement -

కింగ్ నాగార్జున ఒకవైపు సోలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మంచి కథలు వస్తే మల్టీస్టారర్ చిత్రాలను చేసేందుకు ఓకే చెబుతున్నాడు. ఇటీవల తెలుగులో మల్టీ స్టారర్‌గా ‘దేవదాస్’ చేసిన ఆయన, ప్రస్తుతం హిందీలో ఒక మల్టీ స్టారర్ .. తమిళంలో మరో మల్టీ స్టారర్ చేస్తున్నారు. తమిళ సినిమా ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఒక హీరోగా ధనుశ్ .. మరో హీరోగా నాగార్జున నటించనున్నారు.

Nagarjuna

తమిళ స్టార్ హీరో ధనుష్ ఒక వైపు వరుసగా చిత్రాల్లో నటిస్తూనే దర్శకుడిగా కూడా తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తూ తన మామ ముఖ్య పాత్రలో 100 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయాలని భావించాడు. కాని రజినీకాంత్ కొన్ని కారణాల వల్ల నో చెప్పడంతో ఆ పాత్రను నాగార్జునతో చేయిస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాకి ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. అందువలన కొన్ని సన్నివేశాలను తెలుగులోను చిత్రీకరిస్తున్నారు. త్వరలో తెలుగు టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.

- Advertisement -