కింగ్ నాగార్జున కెరీర్లో భారీ హిట్ అందుకున్న మూవీ సోగ్గాడే చిన్ని నాయన
. ఆ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు
తెరకెక్కిస్తామని గతంలో నాగార్జున ప్రకటించారు. 2016లో ఆ ప్రకటన వచ్చింది. కానీ మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు సంబంధించిన అప్ డేట్ రాలేదు. ఒక దశలో ఈ మూవీ తెరకెక్కుతుందా.. అన్న డైలమా కొనసాగింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మూడేళ్లుగా నాగ్‌కి కథ వినిపించారు. కానీ ఓకే కాలేదు. స్క్రిప్టులో మర్పులు చేసి మరోసారి వినిపించాడు. చివరికి నాగ్ ఓకే చెప్పారు.
అయితే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున ‘మన్మథుడు 2’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ‘బంగార్రాజు’ ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ వచ్చింది. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ ఎలక్షన్ ముగిశాక ‘బంగార్రాజు’ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు చెప్పారు. అంటే ఒక వైపున ‘మన్మథుడు 2’ చేస్తూనే .. మరో వైపున ‘బంగార్రాజు’ చేస్తారన్న మాట. ఇక ఈ రెండు సినిమాలు నాగార్జున నిర్మాణ సంస్థలో రానున్నాయి.