వర్మతో నాగ్‌ మొదలుపెట్టాడు..

172
- Advertisement -

ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున మరో సారి రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో సినిమా చేయడానికి కొబ్బరికాయ కొట్టేశారు. ”నాన్నగారు అప్పట్లో ఓ మాటన్నారు. 28 ఏళ్ళకు ఒక నటునికి పరిపూర్ణత వస్తుంది అన్నారు. అలా 28 ఏళ్ళ వయస్సులో శివ చేశాను. ఇప్పుడు 28 ఏళ్ల తరువాత డబుల్ మెట్యూరిటీ వస్తోందని నమ్ముతున్నాను. మళ్ళీ రామూతో సినిమా చేస్తున్నాను” అంటూ చెప్పాడు నాగ్.

ఇక సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. ”రాము బోలెడన్ని మాఫియా మరియు పోలీస్ సినిమాలు చేశాడు. కాని ఈ సినిమా వేరు. మెయిన్ క్యారక్టర్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అద్భుతం. అదే నాకు బాగా నచ్చింది. రాము కొన్నిసీన్లు చెబుతుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయ్. అందుకే ఈ సినిమా చేస్తున్నాం. అలాగే ఈ సినిమాతో రాము మరోసారి టెక్నికల్ స్టాండర్స్డ్ ను కొత్త స్థాయికి తీసుకెళతానని మాటిచ్చాడు. శివతో ఎలాగైతే దేశ వ్యాప్తంగా ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశామో.. ఇప్పుడు కూడా అదే చేస్తాం” అంటూ స్పందించాడు నాగ్‌.

Nagarjuna and Ram Gopal Varma’s film launched

ఈ సందర్బంగా వర్మ మాట్లాడుతూ.. ”సినిమాల్లో నాకు జన్మినిచ్చన అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నాకు ఎంతో గౌరవం. నా ఇంటికంటే అన్నపూర్ణనే నేను పెద్ద ఇల్లుగా ఆరాధిస్తాను. ఇక నేను దేవుడ్ని నమ్మను. కాని నాగార్జునను నమ్ముతాను. రామ్ గోపాల్ వర్మ అనే నేను ఇంతయ్యానంటే.. అసలు నాకు ఏ పేరూ లేనప్పుడు నన్ను నాగ్ నమ్మడమే. అందుకే తనంటే నాకు గౌరవం” అన్నాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి నాలుగోసారి నాగార్జునతో సినిమా చేస్తున్న వర్మ.. మాంచి ఎక్సయిటెడ్ గానే ఉన్నాడు. మరి ఈ సినిమాతో నాగ్ కెరియర్‌లో ఎలాంటి విజయం అందుతుందో చూడాలి. అయితే వర్మకు మాత్రం ఈ విజయం కీలకం. ఎందుకంటే ఈ సినిమా హిట్‌ కాకపోతే ఇక స్టార్ హీరోలు ఆయన్ను దూరం పెట్టేశే ప్రమాదం ఉంది.

- Advertisement -