- Advertisement -
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. అన్నిరాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండగా ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఇప్పటివరకూ ఒక్క కొవిడ్-19 కేసు నమోదుకాకపోవడం విశేషం.
కరోనా నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం మొదటి నుండే అప్రమత్తమైంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నాగాలాండ్‌కు చెందిన వారు స్వరాష్ట్రానికి రాకుండా ఉంటే ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ఇస్తామని తాయిలాన్ని ప్రకటించింది.
మరోవైపు లక్షద్వీప్, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలాంటి వైరస్ యాక్టివ్ కేసులు లేవు.
- Advertisement -