నాగచైతన్య, శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం..

255
naga-chaitanya
- Advertisement -

అక్కినేని నాగచైతన్య తన తరువాతి మూవీ దర్శకుడు శేఖర్ కమ్ములతో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా నాగచైతన్య కెరీర్ లో ఇది 20వ సినిమా. తాజాగా ఈసినిమా పూజా కార్యాక్రమాలు హైదరబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు పాల్గొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆగష్టులో గానీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత తీస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో భారీగా అంచనాలున్నాయి. ఇక నాగచైతన్య కూడా మంచి ఫాం లో ఉండటంతో ఈసినిమా ప్లస్ గా మారనుంది. ఇటివలే మజిలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు చైతూ. ప్రస్తుతం నాగచైతన్య బాబీ దర్శకత్వంలో వెంకీమామ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. వెంకీమామలో నాగచైతన్య వెంకటేశ్ లు హీరోలుగా నటిస్తున్నారు.

- Advertisement -