9ఏళ్ల సినీ ప్రస్ధానం.. ఎమోషనల్ అయిన సమంత

375
Samantha
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంత ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 9ఏళ్లు పూర్తి చేసుకుంది. మొట్టమెదటిసారిగా అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఏమాయ చేసావె చిత్రంలో నటించింది. ఈచిత్రం విడుదలయి నేటితో 9ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈచిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉండి 2017 అక్టోబరులో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నాగచైతన్య తనకు భర్త కావడానికి కారణమైన ఏమాయ చేసావె చిత్రం విడుదల తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు సమంత.

(రాజకీయాల్లోకి నటి సుమలత..పోటీ ఎక్కడి నుంచో తెలుసా?)         https://goo.gl/s2oNuc

ఈమూవీకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని నిర్మించారు. ఈసందర్భంగా ఈచిత్ర నిర్మాత మంజులా పాత రోజుల గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ‘ఏ మాయ చేసావే’ పోస్టర్ షేర్ చేసి “9 ఏళ్ళయింది కానీ ఇంకా నిన్నటిలాగే ఉంది.. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఛీర్స్ అంటూ
ట్వీట్ చేశారు. మంజుల చేసిన ట్వీట్ కు సమంత రిప్లే ఇచ్చారు.

నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. నాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేసింది. ఈ 9ఏళ్లలో ఎన్నో రకాల పాత్రలు వేస్తూ టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉన్నాను నాకు ఇంతగా సపోర్ట్ చేసిన వారందరికి ధన్యవాదాలు తెలపుతున్నాని ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం సమంత, నాగచైతన్య కలిసి మజిలి చిత్రంలో నటిస్తున్నారు. నిన్ను కోరి మూవీ దర్శకుడు శివ నిర్వాణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎప్రిల్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -