అక్కినేని హీరో మూవీలో విజయ్ దేవరకొండ హిరోయిన్

248
Priyanka Juwalkar Akkineni Akhil
- Advertisement -

అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను మూవీ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోవడంతో నిరాశలో ఉన్నారు ఆయన అభిమానులు. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన మూడు సినిమాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేదు. దీంతో తన తర్వాతి మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ అక్కినేని హీరో. అఖిల్ తన తర్వాతి మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు భాస్కర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బొమ్మరిల్లు సినిమా విజయం సాధించడంతో ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా ఆయనకు పేరోచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నటీనటుల ఎంపీక చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమూవీలో అఖిల్ కు జోడిగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నారట చిత్రబృందం. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అఖిల్ సరసన టాక్సీవాలా మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జువాల్కర్ ను ఎంపీక చేసినట్టు తెలుస్తుంది. తొలి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులను అలరించింది. పైగా తెలుగు అమ్మాయి కావడంతో ఆమెను ఎంపీక చేసినట్టు ఫిలీం నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్మడు. ఈచిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అఖిల్ ఈసినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి మరి.

- Advertisement -