రివ్యూః మజిలీ

371
majili
- Advertisement -


అక్కినేని నాగచైతన్య ఇటివలే ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆయన నటించిన చివరి రెండు సినిమాలు శైలజరెడ్డి అల్లుడు, సవ్యసాచి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య బాక్సాఫిస్ వద్ద బోల్తాకొట్టింది. భార్య సమంతతో కలిసి హిట్ కొట్టేందుకు ఇవాళ ప్రేక్షుకుల మందుకు వచ్చాడు నాగచైతన్య. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మూవీ మజిలీ. నిన్నుకోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న చైతూకి ఈసినిమా ఎంత మేరకు సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం..

కథః
కథ విషయానికి వస్తే.. పూర్ణ(నాగ చైతన్య) టీనేజ్ క్రికెటర్. అతనికి క్రికెట్టే ప్రపంచం. అలాంటి సమయంలో క్రికెట్‌తో పాటు మరో ఇష్టం కూడా పూర్ణలో కలుగుతుంది. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ, వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించరు. దీంతో ఇద్దరూ విడిపోతారు. అనుకోని పరిస్థితుల్లో శ్రావణి(సమంత)తో పూర్ణ పెళ్ళి జరిగిపోతుంది. తనకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి వల్ల పూర్ణ ఎలా మారిపోయాడు? తన ప్రేమ నుంచి బయటపడి శ్రావణితో తన దాంపత్య జీవితాన్ని గడిపాడా? ఈ ప్రయాణంలో చోటుచేసుకున్న సంఘటనలు, భావోద్వేగాల సమాహారమే ‘మజిలీ’.


ప్లస్ పాయింట్స్ః ఈ సినిమాలో సమంత, నాగచైతన్య నటన అద్భుతమని అంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత నటన మరో స్థాయిలో ఉందట. చైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. ప్రేమలో విఫలమై జీవితం మీద విరక్తి కలిగిన భర్తను అర్థం చేసుకునే భార్య పాత్రలో సమంత చంపేసిందట. దర్శకుడు శివ నిర్వాణ మరోసారి తనదైన శైలిలో ఒక ఎమోషనల్ రైడ్‌ను ప్రేక్షకులకు అందించారట. ఎస్.ఎస్.తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసిస్తున్నారు. గోపీ సుందర్ అందించిన పాటలు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు.

మైనస్ పాయింట్స్ః
ఫస్ట్ ఆఫ్‌ కాస్త బానే ఉన్నా సెకాండాఫ్ లో మాత్రం కొంచెం నెమ్మదిగా సాగినట్టు చెబుతున్నారు. అలాగే ఫస్ట్ ఆఫ్ లో కథ రోటిన్ గానే ఉండటం.

విడుదల తేదీ:05/04/2019
రేటింగ్‌: 3
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌, రావూ రమేష్‌, పోసాని కృష్ణమురళి
సంగీతం: గోపి సుందర్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం: శివ నిర్వాణ

- Advertisement -