- Advertisement -
వెంకీమామ తర్వాత నాగచైతన్య…శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చైతూకు 20వ సినిమా కాగా ఈ మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా సంక్రాంతికి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. సినిమా ఫస్ట్ లుక్‌ని సంక్రాంతికి విడుదల చేయనుండగా తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో భారీగా అంచనాలున్నాయి. ఇక నాగచైతన్య కూడా మంచి ఫాం లో ఉండటంతో ఈసినిమా ప్లస్ గా మారనుంది.
- Advertisement -