ఐటీ,రక్షణ రంగ ఉత్పత్తులకు కేరాఫ్ హైదరాబాద్: కేటీఆర్

368
ktr delhi
- Advertisement -

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏయిరో స్పేస్ షో “ వింగ్స్ ఇండియా-2020” కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి కె.తారక రామారావు పాల్గోన్నారు. డీల్లీలో జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రతినిధులు, ఏయిరోస్పేస్, ఢిపెన్స్ కంపెనీల టాప్ లీడర్ షిప్ (ప్రతినిధులు) పాల్గోన్నారు. ఈ సమావేశంలో మంత్రి కెటి రామారావు ప్రసంగించారు. ఈ సన్నాహక సమావేశంలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మంత్రి దన్యవాదాలు తెలిపారు.

వింగ్స్ ఇండియా 2020తోపాటు గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ సదస్సును హైదరాబాద్ లో నిర్వహస్తున్నందుకు దన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ర్టం దేశంలోని ప్రగతి శీల రాష్ర్టాల్లో ఒకటని, వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ర్టమని మంత్రి కెటియార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పనితీరు వలన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ లో ఆగ్రస్ధానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణకు ఏయిరో స్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యత రంగ హోదా ఇచ్చిందని, తెలంగాణలో ఈ రంగంలో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వతా గత ఇదున్నర సంవత్సరాలుగా ఏయిరోస్పేస్, ఢిపెన్స్ రంగం ఈకో సిస్టమ్ భాగా వృద్ది చెందిందని తెలిపారు. ఏయిరోస్పేస్ మ్యాన్యూఫాక్చరింగ్ లో ప్రపంచ స్ధాయి కంపెనీలైన బోయింగ్, జీఈ, సఫ్రాన్, రాఫేల్, లాక్ హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు తెలంగాణకు వచ్చాయన్నారు.

దీంతోపాటు స్థానికంగా సూమారు 1000 ఏయిరోస్పేస్, ఢిఫెన్స్ కంపెనీలు యంయస్ యంఈ రంగంలో ఉన్నాయన్నారు. తెలంగాణలో 4 ఏయిరో స్పేస్ పార్కులున్నాయని, అనేక ఏలక్ర్టానిక్స్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్స్, హర్డ్ వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్ లున్నాయన్నారు. ఏయిరోస్పేస్ రంగంలోని శిక్షణ రంగంలోనూ హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నదని తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో టిహబ్, విహబ్ ఉన్నాయని, త్వరలో ప్రారంభం కానున్న టి వర్క్స్ ద్వారా ఏయిరోస్పేస్, ఢిఫెన్స్ రంగంలో వినూత్నమైన అలోచనలు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే టిహబ్ బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏయిరోస్పేస్ స్టార్ట్ అప్స్ కంపెనీలతో పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలోని తొలిసారిగా డ్రోన్ పాలసీ తీసుకువచ్చిన తొలి రాష్ర్టం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

ఏయిరోస్పేస్ రంగానికి సైతం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఏటియఫ్ పైన 16 శాతం నుంచి 1శాతం తగ్గించిన రాష్ర్టం తెలంగాణ అన్నారు. దీని వలన ప్రాంతీయ ఏయిర్ లైన్స్ పరిశ్రమ వృద్దికి ఉపయుక్తంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ ఏయిర్ పోర్ట్ అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ది చెందుతున్నదని, ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ‘ఫ్లైయింగ్ ఫర్ అల్’ అనే నినాదంతో జరిగే వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమ స్పూర్తి మేరకు ఏయిరో స్పేస్ రంగం మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వరంగల్, అదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్ పల్లి, పెద్దపల్లి, మహబూబ్ నగర్(అద్దకల్)లల్లో ఏయిర్ పొర్టుల ఏర్పాటు, వరంగల్లో ఐటి క్లస్టర్, ఫార్మాసిటీ వంటి చోట్ల సబ్సీడైయిడ్జ్ హెలీ పోర్టుల ఏర్పాటుకు ప్రణాళిలకు సిద్దం చేస్తున్నామని తెలిపారు. హెలీ పోర్టుల ద్వారా తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ది, నూతన పారిశ్రామిక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరం అయిన అనుమతులు, మౌళిక వసతుల సపొర్ట్ కోసం నిధులు ఇవ్వాలని కోరారు. మార్చ్ నెలతో జరగనున్న ఈ “వింగ్స్ ఇండియా -2020” కార్యక్రమానికి అతిథ్యం ఇస్తుండం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి, ఈ కార్యక్రమం ద్వారా ఏయిరో స్పేస్, ఢిఫెన్స్ రంగంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుకలుగుతుందని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.

వింగ్స్ ఇండియా 2020 కోసం డీల్లీలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామరావు, ఈరోజు పలు ప్రముఖ ఏరోస్పేస్, ఢిఫెన్స్ రంగ కంపెనీల ప్రతినిధులను కలిసారు. ఏయిర్ బస్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, బిఏఈ (బే) కంపెనీల ఇండియా అధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుతం అయా కంపెనీలు నిర్వహిస్తున్న కార్యాకలాపాలపైన చర్చించారు. దీంతోపాటు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏయిరో స్పేస్, ఢిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తున్నదని తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ సహాకారం, చొరవ వలన ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుడులు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం దేశంలో ఏయిరో స్పేస్ రంగంలో మరింత వృద్దికి అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ రంగానికి ప్రాధన్యత ఇస్తున్నదన్న మంత్రి, కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో మరిన్ని మాన్యూఫాక్చరింగ్ (తయారీ) రంగంలో పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. దీంతోపాటు ఏయిరో స్పేస్ రంగంలో శిక్షణ ( స్కిల్లింగ్) రంగంలో జీఈ, ఏయిర్ బస్, సాఫ్రాన్ వంటి కంపెనీల భాగసామ్యన్ని కోరారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరం అయిన మానవ వనరుల కోసం తెలంగాణ అకాడమీ అఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరపున శిక్షణ ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఏయిరో స్పేస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరం అయిన టెక్ సపొర్ట్ సేవలను వరంగల్ లాంటి ద్వీతీయ శ్రేణి నగరాల నుంచి కూడా అందించేందుకు అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏయిర్ బస్ ఇండియా సియివో అనంద్ స్టాన్లీ, సాఫ్రాన్ ఇండియా సియివో పియర్రీ డికెలీ, బే సిస్టమ్స్ యండి నిక్ కన్నా, జీఈ ఏవియేషన్ ఇండియా అధినేత (కంట్రీ హెడ్) విక్రమ్ రాయ్, తలాస్ కంపెనీ ఉపాద్యక్షులు కపిల్ కిషోర్, యూనైటెడ్ టెక్నాలజీస్ ప్రాంతీయ డైరెక్టర్ సమిత్ రే తదితరులు మంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో డీల్లీ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.

- Advertisement -