- Advertisement -
చైతూ-సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఏంమాయ చేశావో అందరికి గుర్తుండే ఉంటుంది. క్లాసికల్ హిట్ గా నిలిచిన ఈ మూవీ వీరిద్దరికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరి ఇటీవలె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆటోనగర్ సూర్య, అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాలో కనిపించిన ఈ జోడి ప్రేక్షకులను మెప్పించింది.
ఇక పెళ్లి తర్వాత ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. చైతూతో ‘శైలజా రెడ్డి అల్లుడుసతో బిజీగా ఉండగా సమంత చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇక శైలజా రెడ్డి సినిమాలో హీరోయిన్ పాత్రను సమంతతో చేయించాలని మారుతి గట్టి ప్రయత్నమే చేశాడు గానీ కుదరలేదు.
అయితే, త్వరలోనే ఆ ముచ్చట తీరనుందట. రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా మారి డీవీవీ దానయ్యతో కలిసి ‘నిన్నుకోరి’ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది.దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు శివ మరో సినిమాను నిర్మించడానికి కోన వెంకట్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు.
ఈ సినిమాలో చైతూను కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. కథ .. పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి సమంత కూడా అంగీకరించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సో ఎంతోకాలంగా వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్యాన్స్ కు ఈ మూవీ మంచి ట్రీట్ ఇస్తుందనే చెప్పాలి.
- Advertisement -