ఒక్కటైన అందాల ప్రేమజంట…

260
Naga Chaitanya ties the knot with Samantha in Goa
- Advertisement -

టాలీవుడ్ అందాల ప్రేమజంట ఒక్కటైంది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల ఆనందోత్సాహాల నడుమ నాగచైతన్య, సమంతల అంగరంగవైభవంగా జరిగింది.  గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో హిందూ సాంప్రదాయంలో చైతూ- సమంత మెడలో మూడు ముళ్లు వేశారు.

అక్కినేని నాగార్జున, తల్లి దగ్గుబాటి లక్ష్మి ఇద్దరూ టాలీవుడ్ అగ్ర కుటుంబాలకు చెందినవారు కావడంతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బంధువులు, అత్యంత సన్నిహితులు ఈ వివాహవేడుకకు హాజరయ్యారు.సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు క్రిస్టియన్ పద్దతిలో వెడ్డింగ్ జరుగబోతోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సరిగ్గా రాత్రి 11:52 నిమిషాలకు వివాహం జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ దంపతులు నాగచైతన్య, సమంతలపై అభిమానులు అభినందనలు, శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ఈ పెళ్లివేడుకలో పెళ్లికూతురు సమంత.. నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. వీరి వివాహ వేడుకకు మీడియాను అనుమతించకపోవడంతో తన అభిమానులకోసం కొన్ని ఫోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

- Advertisement -