ఏప్రిల్ 2న చైతూ లవ్ స్టోరీ..!

357
naga chaitanya

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 2020 ఏప్రిల్ 20న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోండగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కులం కాన్సెప్ట్ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ స్లాంగ్‌తో వస్తోంది ఈ మూవీ. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలంగాణ స్లాంగ్‌ను నేర్చుకున్నారు చైతూ. ఇప్పటికే ఫిదాలో తెలంగాణ యాసతో అదరగొట్టిన సాయిపల్లవి ..చైతూతో కలిసి ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Naga chaitanya Love Story will hit the screens in April 2020 and an official announcement about the release date would be made soon.