ఆమిర్‌ ఖాన్‌ మూవీలో అక్కినేని హీరో..

195
Naga Chaitanya
- Advertisement -

బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘లాల్‌ సింగ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమిర్‌ సరసన కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు.

ఈ పాత్ర కోసం నాగచైతన్య నెలరోజుల పాటు డేట్స్‌ కేటాయించాడు. మే నెల నుంచి షూటింగ్‌లో చైతన్య భాగమవుతున్నాడు. నిజానికి చైతూ చేయాల్సిన పాత్రలో కోలీవుడ్‌ హీరో విజయ్‌ సేతుపతి నటించాల్సింది. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో విజయ్‌ సేతుపతి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని సమాచారం. మరి ‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్య ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, పాత్ర వ్యవథి ఎంత సేపు ఉంటుందనే విషయాలు తెలియాల్సివుంది.

- Advertisement -