విలన్‌గా మారనున్న అక్కినేని హీరో..!

115
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో చైతూ ఆ సినిమాకి సంబంధించిన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈ యంగ్‌ హీరో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలన్ని వెల్లడించారు. అందులో ఆయన డిజిటల్ డెబ్యూ ఒకటి. చైతూ ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతూ.. ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. విక్ర‌మ్ గ‌తంలో అక్కినేని హీరోల‌తో క‌లిసి ప‌ని చేశారు.‘మనం’ కి దర్శకత్వం వహించిన విక్రమ్ ఇప్పుడు చైతూతో క‌లిసి థ్యాంక్స్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -