చైతూ.. సమంతల ‘మజిలి’

308
samantha nagachaitanya
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ యువ జంట నాగచైతన్య, సమంతలు మళ్లీ ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా అని వారి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంతలు కలిసి నటించేందుకు రంగం సిద్ధమైంది. వీరిద్దరు త్వరలోనే ఓ మూవీలో నటించబోతున్నారు.

samantha nagachaitanya

శివ నిర్వాణ దర్శకత్వంలో వీరి రియల్‌ లైఫ్‌లోనే కాకుండా రీల్‌ లైఫ్ లోనూ భార్యా భర్త లుగా నటించబోతున్నారు. ఈ మూవీలో వీరిద్దరి మద్యలోకి ఓ యువతి ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరి మద్య గ్యాప్‌ ఏర్పడనుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మద్య మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఒకరిపై ఒకరిపై ఉన్న అమితమైన ప్రేమ కారణంగా ఇద్దరు తిరిగి కలుస్తారని సినిమా కథ. కుటుంబ అనురాగాలు, భార్య భర్తల మద్య ఉన్న ప్రేమ విలువలను తెలిపే ఉద్దేశ్యంతో దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.

samantha nagachaitanya

హరీష్‌ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ప్రేయసి లేదా మజిలి అని టైటిల్‌ ఫిక్స్‌ చేయనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో చైతూ క్రికెటర్‌ పాత్రలో కనిపించనున్నాడట. పెళ్లికి ముందు ఏం మాయ చేసావే సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టిన ఈ జంట పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న ఈ మూవీతో ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.

- Advertisement -