ఆ తరువాతే హనీమూన్..

226
Naga Chaitanya and Samantha honeymoon destination revealed
- Advertisement -

సమంత .. నాగచైతన్య వివాహం ఈ నెల 6 .. 7 తేదీలలో హిందూ .. క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరగనుంది. ఆ తరువాత ఈ జంట హనీమూన్ ట్రిప్ వుంటుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. వివాహ వేడుక అనంతరం తాము పెద్దగా గ్యాప్ తీసుకోమనీ, షూటింగ్స్ ను పూర్తి చేసే విషయంపైనే శ్రద్ధ పెడతామని సమంత.. చైతూ గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్లు అదే మాట అంటున్నారు.

Naga Chaitanya and Samantha honeymoon destination revealed

ప్రస్తుతం సమంత ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగును ఆమె పూర్తిచేయవలసి వుంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా కోసం చందూ మొండేటితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అందువలన సమంత.. చైతూ ఇద్దరూ కూడా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని, డిసెంబర్ చివరివారంలోగానీ, జనవరి మొదటివారంలో గాని హనీమూన్ ట్రిప్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -