అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు కలిసి నటించిన ‘గుండమ్మ కథ’ సినిమాకి ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఎంతమాత్రం ఆదరణ తగ్గలేదు. ఆ సినిమా కథా కథనాలు చిత్రీకరణ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాంటి ఈ సినిమాను బాలకృష్ణ – నాగార్జునలతో రీమేక్ చేయాలనే ఆలోచన చాలాకాలం క్రితమే చేశారు గానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తర్వత ‘గుండమ్మ కథ’ను నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేస్తున్నారని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైతూకి ఈ ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా గురించి తాజాగా అక్కినేని నాగచైతన్య స్పందిచాడు.
‘గుండమ్మ కథ’ చేస్తున్నారా? లేదా? అని చైతన్యను ఓ అభిమాని ప్రశ్నిచగా. దానికి చైతూ ఇలా సమాధానం చెప్పాడు. ‘‘అంత గొప్ప సినిమాను తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ సినిమా కచ్చితంగా చేయాలనే కోరిక అయితే నాకుంది. కాకపోతే ఇప్పుడు కాదు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక. తాతగారిలా కాకపోయినా నటనలో ఇంకొంచెం మెరుగయ్యాక చేస్తా. ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టు కాకుండా.. ప్రస్తుత కాలానికి.. అంటే ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆ సినిమాను తప్పకుండా చేస్తా.’’ అని చైతన్య చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాపై జూనియర్ యన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి..