తెలుగోడి హృదయం ఉప్పోంగింది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 95వ అకాడమీ వేడుకలలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.
కీరవాణి, చంద్రబోసు ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. నాటునాటు పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేయగా గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఈ పాటకు ఊపు తెచ్చారు.ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ స్టెప్పులతో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు.
ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకుంది.ఈ ఏడాది జనవరి 10న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.ఇక ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఇద్దరు నటులు బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ కార్పెట్ నడిచి తలుక్కున మెరిసిపోయారు.
ఇవి కూడా చదవండి..