నాటు నాటు సాంగ్ లైవ్‌..ఎందులో తెలుసా..!

31
- Advertisement -

ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమాలోని నాటునాటు సాంగ్ మరికొన్ని గంటల్లో ఆస్కార్ వేదికపై పాడనున్నారు. కీరవాణి స్వరపరిచన ఈ పాటను కాలభైరవ రాహుల్‌ సిప్లిగంజ్ కలిసి ఈ వేదికపై పాడనున్నారు. అయితే ఈ ప్రదర్శనను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది.

95వ ఆస్కార్ వేడుక లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ వేదికపై ఇప్పటివరకు ఆస్కార్ వేదికపై ఎఆర్ రెహమన్, రిహన్న, సోఫియా కార్సన్, స్టెఫానీ హు, డయాన్ వారెన్, డేవిడ్ బ్రైన్, సన్‌లక్స్‌ లాంటి స్టార్స్ ఆస్కార్ వేదికపై ప్రదర్శనలు చేశారు. అకాడమీ అవార్డుల వేదికపై ఈ పాటను ప్రదర్శించడం ద్వారా దక్షిణాసియా సినీ పరిశ్రమ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.

జీ5గ్లోబల్ డిజిటల్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ వేదికను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ఫ్రైజెస్ లిమిటెడ్ ప్రారంభించింది.2018 అక్టోబర్లో 190దేశాల్లో 18భాషల్లో విడుదల చేశారు. కాగా 2022లో ఆర్ఆర్ఆర్‌ సినిమా స్ట్రీమ్‌ అయినే 10రోజుల్లోనే ఈ సినిమా 1000మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సంపాదించింది. భారతదేశంలోనే గాకుండా ప్రపంచవ్యవాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా…జీ5 ఓటీటీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొ్చు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఈ సాంగ్‌ ఆస్కార్ వేదికపై ప్రదర్శించే సమయంలో జీ5లో లైవ్‌ స్ట్రీమ్‌ కానుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరూ చూడండి.. జీ5లో..!

ఇవి కూడా చదవండి…

NTR30 షూటింగ్ ఎప్పుడంటే?

కృతిసనన్ కి ఘాటు మెసేజ్ లు

పిక్ టాక్ : బాబోయ్ ఇవేం అందాలండోయ్

- Advertisement -