నాని.. ఓ తరానికి ప్రేరణ !

41
- Advertisement -

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లో హీరో అయ్యి, లాంగ్ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేయడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ను ప్రారంభించి.. నేడు స్టార్ హీరో అవ్వడం అంటే.. కచ్చితంగా ఓ తరానికి ప్రేరణే. ఆ ప్రేరణను కలిగించిన వ్యక్తే నేచురల్ స్టార్ నాని. నేడు నాని పుట్టినరోజు. 1984లో కృష్ణా జిల్లాలో జన్మించిన నాని.. బాపు, శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అష్టాచమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకూ సాధారణ కుర్రాడిగా లైఫ్ లీడ్ చేసిన నాని.. ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

పైగా ‘అష్టాచమ్మా’ సినిమాతో నాని జనానికి బాగా నచ్చాడు. ఆ తర్వాత నానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ‘రైడ్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చేసుకుంటూ ‘భీమిలి కబడ్డీ జట్టు’ను నడిపాడు. ఐతే, కబడ్డీ జట్టు ప్రేక్షకుల పై బలమైన ముద్రను వేయలేకపోయింది. మళ్లీ నాని కెరీర్ కి కష్టకాలం మొదలైంది. ఐతే, ‘అలా మొదలైంది’ నాని సక్సెస్ జర్నీ.

‘అలా మొదలైంది’తో హీరోగా కెరీర్‌కు నాని మంచి పునాది వేసుకున్నాడు. ఇక అక్కడ నుంచి సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ నేచురల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో చేసిన పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, మజ్ను, నిన్ను కోరి, జెర్సీ లాంటి సూపర్ హిట్లతో మొత్తానికి నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. హ్యపీ బర్త్ డే నాని

ఇవి కూడా చదవండి…

పవన్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!

ఎస్పీ సినిమాస్.. నేనే నా

- Advertisement -