సీతారామంలో సీతా పాత్రతో యావత్తు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తారా మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈ భామకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈ భామ చాలా జాగ్రత్తగా కెరీర్‌ను బిల్డప్ చేసుకుంటుంది. మృణాల్ సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని మృణాల్ కామెంట్స్ సెక్షన్‌లో ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నావైపు నుంచి ఓకే. అని కామెంట్ చేశాడు. దీనికి మృణాల్ కూడా క్యూట్‌గా స్పందింస్తూ..నావైపు నుంచి ఓకే కాదుగా.. అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసింది. వీళ్లిద్దరి సంభాషణ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతోన్న ఓ నాని30లో నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇవి కూడా చదవండి…