మెడికో ప్రీతి మృతిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశారు. ప్రీతి మృతితో తల్లిగా తాను ఎంతో మనో వేదనకు గురయ్యనన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్టర్ వేదికగా ప్రీతి మృతికి సంతాపం ప్రకటిస్తూ..తల్లిదండ్రులకు లేఖ రాశారు.
ఈ సందర్భంగా…ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని అని అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. సమాజానికి సేవ చేయాలన్న తపన పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం.
కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. మీకుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృత్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అని తెలిపారు.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023
ఇవి కూడా చదవండి…

