CRPF:నాదొక విన్నపం..కేటీఆర్‌

45
- Advertisement -

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ట్వీట్ చేశారు. దాదాపు 1.30లక్షల ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వాళ్లకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షలను భారత రాజ్యంగం ప్రకారం గుర్తించిన భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలన్నారు. ఇంగ్లీష్ మీడియం చదవని అభ్యర్థులతో పాటు హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పిటిటీవ్ ఎగ్జామ్స్‌ను 12 భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని జాతీయ నియామ‌క సంస్థ చెప్పింది. కానీ సీఆర్‌పీఎఫ్ నియామ‌క నోటిఫికేష‌న్‌లో ఆ విధానాన్ని అమ‌లు చేయ‌డం లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

జీతం: ప్రతి నెలా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.విద్యార్హత: 10వ తరగతి. అభ్యర్థులు ఖచ్చితంగా 18 నుండి 23 వయస్సు వారై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఐదు సంవత్సరాల సడలింపు ఉండగా వెనుకబడిన వర్గాల వారికి మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీరులకు మూడు సంవత్సరాలు, ఫస్ట్ బ్యాచ్ మాజీ అగ్నివీరులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.అభ్యర్ధి శారీరక సామర్ధ్య పరీక్ష, రాత పరీక్ష పాస్ కావల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి…

CRPF: భారీ నోటిఫికేషన్

కిరణ్ కుమార్ రాకతో తీరు మారేనా ?

TELANGANA:తెలంగాణలో 24*7 రిటైల్ షాపింగ్స్‌మాల్స్..!

- Advertisement -