CRPF: భారీ నోటిఫికేషన్

46
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీగా సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మహిళలకు, మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్​ సైతం కల్పించింది.

దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలకాగా మొత్తం ఖాళీలు:1,29,929గా ఉన్నాయి. జీతం: ప్రతి నెలా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.విద్యార్హత: 10వ తరగతి. ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలుగా ఉండగా పోస్ట్ జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్ గా పోస్టులను ప్రభుత్వం వర్గీకరించింది.

అభ్యర్థులు ఖచ్చితంగా 18 నుండి 23 వయస్సు వారై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఐదు సంవత్సరాల సడలింపు ఉండగా వెనుకబడిన వర్గాల వారికి మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీరులకు మూడు సంవత్సరాలు, ఫస్ట్ బ్యాచ్ మాజీ అగ్నివీరులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.అభ్యర్ధి శారీరక సామర్ధ్య పరీక్ష, రాత పరీక్ష పాస్ కావల్సి ఉంటుంది.

https://rect.crpf.gov.in/

ఇవి కూడా చదవండి..

- Advertisement -