Telangana:24*7 రిటైల్ షాపింగ్స్‌మాల్స్

60
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో 24గంటలు షాపింగ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా చిరు వ్యాపారులను, వర్తక, వాణిజ్య, వ్యాపారులకు లాభం చేకూరేవిధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) స్వాగతించింది.

ఈ మేరకు తెలంగాణ షాప్స్‌ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ 1988లోని సెక్షన్ 2(21)లో నిర్వచించిన విధంగా దుకాణాలు మరియు సంస్థలకు సెక్షన్ 7ప్రారంభ మరియు ముగింపు పని గంటల నుండి మినహాయింపులను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ఏఐ చాలా నెలలుగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. కరోనా తర్వాత చిల్లర చిరు వ్యాపారులు బాగా నష్టాల పాలవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్ఏఐ ప్రకటించింది.

ఈ సందర్బంగా ఆర్ఏఐ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ…24*7ఆపరేటింగ్‌ సదుపాయమనదే వినియోగదారులకు వ్యాపారాలకు మరియు ప్రభుత్వాలకు చాలా లాభాదాయకమన్నారు. ఇలాంటి సౌకర్యం కల్పించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరినట్టుగా తెలిపారు. అంతకుముందు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు.

24×7 రిటైల్‌ను ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలు మరియు పన్ను వసూలు చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. భారతదేశంలో ఆధునిక రిటైల్‌ రంగ పరిశ్రమ వృద్ధికి సరైన వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆర్ఏఐ వాటాదారులతో కలిసి పనిచేయనుంది. భారతదేశంలో రిటైల్ రంగంలో 2032నాటికి $2ట్రిలియన్లకు చేరుతుందని అంచనా వేశామని తెలిపారు. అంతేకాకుండా దేశ జీడీపీలో రిటైల్‌ రంగం వాటా 10% ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

KCR:కే‌సీ‌ఆర్ తో మాములుగుండదు మరి !

MODi:మోదీ రాకతో…రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!

TELANGANA:కేంద్రం ప్రకటించే అవార్డులన్ని తెలంగాణకే: హరీశ్‌

- Advertisement -