భారత అత్యున్నత న్యాయమూర్తి తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఓ కేసులో భాగంగా ఏప్రిల్ 17న సీజేఐ ధర్మాసనం విచారించనున్న పిటిషన్‌పై ముందస్తు విచారణ జరిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని ఆ లాయర్ చేసిన వ్యాఖ్యలకు సీజీఐ తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా మీకేసు విచారణ 17వ తేదీన లిస్ట్ అయి ఉంది. ఇప్పుడు 14వ తేదీ కోసం మరో ధర్మాసనం ముందుకు వెళ్తానని చెబుతున్నారు. నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ పనిచేయవు. మీ కేసు విచారణ 17వ తేదీనే చేపడతామని ఖారకండీగా తెల్చి చేప్పేశారు. నా అధికారం జోలికి రావొద్దు అంటూ మండిపడ్డారు. దీంతో ఆ న్యాయవాది సీజేఐకు క్షమాపణలు తెలిపారు. దీనికి చంద్రచూడ్ బదులిస్తూ..మీక్షమాపణలను అంగీకరిస్తున్నాం. అయితే నా అధికారులను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి. నా అధికారాల జోలికి రావొద్దు అని మందలించారు.
ఇవి కూడా చదవండి…