స్టీల్ ప్లాంట్ కుట్ర.. అసలు కథ ఇదే !

44
- Advertisement -

ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయంపై ఏపీ ప్రజల నుంచి.. ప్రధాన పార్టీల నేతల నుంచి భారీగానే వ్యతిరేకత ఎదురైంది. కేంద్రం ప్రైవేటీకరణ అంశాన్ని రద్దు చేసుకోవాలని గట్టిగానే డిమాండ్ వినిపించింది. కానీ అందుకు మోడి సర్కార్ మాత్రం నిరాకరించింది.. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ పార్టీలు కూడా దీనిపై మాట్లాడడం మానేశాయి. .

అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ గొంతు విప్పడం ఆసక్తికరంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ రద్దు ఆపాలని, అది ఆంధ్రుల హక్కు అని మంత్రి కే‌టి‌ఆర్ కేంద్రానికి ఇటీవల బహిరంగ లేఖ రాశారు. అంతే కాకుండా విశాఖా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం చేస్తున్న కుట్రను కూడా ఆయన తేటతెల్లం చేశారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారని, భాగంగానే విశాఖా స్టీల్ ప్లాంట్ ను ఆధానీకి అమ్మేయలనే ఆలోచనలో మోడీ ఉన్నారని, అందుకే స్టీల్ ప్లాంట్ ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు అవసరమైతే బిడ్డింగ్ లో కూడా పాల్గొంటామని మంత్రి కే‌టి‌ఆర్ వెల్లడించారు. దీంతో స్టీల్ ప్లాంట్ విషయంలో కే‌టి‌ఆర్ చూపిస్తున్న చొరవపై ఏపీలోని రాజకీయ వాదులు ప్రశంశలు కురిపిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్డింగ్ లో పాల్గొనేందుకు సిద్దమైతే.. ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ చొరవ అటు ఏపీ రాష్ట్ర పార్టీలను, కేంద్ర పెద్దలను కలవర పరుస్తోంది. మరి రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అంశాపై మరింత బలంగా పోరాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి…

BRS:ప్రతీ గ్రామంలో జెండా ఎగరాలి

CJI:నా పవర్స్ జోలికి రావొద్దు..సీజేఐ

ELNINO:ఈ యేడాది సాధారణ వర్షపాతం..!

- Advertisement -