మిలటరీ ఊళ్లో.. బన్నీ ఆడియో వేడుక..

506
Na Peru Surya Audio in Military Madhavaram
- Advertisement -

వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నాపేరు సూర్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మే 4న ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీ ఉంది. ఇప్పటికే బన్నీ లుక్స్, సాంగ్స్, టీజర్స్‎తో ఆడియన్స్‎లో హైప్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‎గా మారింది.

Na Peru Surya Audio in Military Madhavaram

అదేంటంటే ఈ మూవీ ఆడియో కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా.. తాడేపల్లి గూడెం సమీపంలోని ‘మిలటరీ మాధవరం’ అనే పల్లెటూరిలో జరపాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. మిలటరీ మాదవవరంలో వేడుక చేయడనాకి గల కారణం ఏంటంటే ఆ ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఆర్మీలో ఉండటమే. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‎గా కనిపంచనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే బన్నీ ఈ వేడుకకు ఒక రోజు ముందే ఆ ఊరికి వెళ్లి అక్కడి మిలటరీ కుటుంబాలను కలుస్తారని సమాచారం.

అయితే ఈ ఆడియో కార్యక్రమం తర్వాత ఏప్రీల్ 29న ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్ వేడును నిర్వహిస్తారట. గచ్చిబౌలి, యూసఫ్‎గూడా పోలీస్‎గ్రౌండ్, ఎల్బీ స్టేడియం ఈ మూడింటిలో ఎక్కడ ఈవెంట్ నిర్వహిస్తారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నా పేరు సూర్యతో మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్న బన్నీ ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌–శేఖర్‌ ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా అనే పేరుతో కోలీవుడ్‌లో విడుద‌ల కానుంది.

- Advertisement -