అల్లు అర్జున్ “ఐకాన్” లో నివేదా

333
allu-nivetha
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఇటివలే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించింది. గీతా ఆర్ట్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈసినిమాతో పాటు బన్ని వరుసగా మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు బన్నీ. ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇక ఈసినిమాలో హీరోయిన్ ఎంపిక పై కసరత్తు జరుగుతుంది. తాజాగా ఉన్న సమచారం ప్రకారం నివేదా పేతురాజ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

నివేదా పేతురాజ్ ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుంది. ఇప్పడు బన్నీ తర్వాత మూవీలో కూడా ఛాన్స్ రావడంతో అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసిందని చెప్పుకోవాలి. మెంటల్ మదిలో, చిత్రలహరి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా.

- Advertisement -