గోవులను కబేళాలకు తరలిస్తున్నారన్న నేపథ్యంలో కొన్ని అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గోవధను నిషేధించాలంటూ ఆర్ఎస్‌ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గోవధను నిషేధించాలంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువులు తల్లిగా భావించే గోవును చంపి తినడం దారుణమని, గోవధను మానుకుంటేనే మూకహత్యలు ఆగుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు ఉత్తరప్రదేశ్ షియా వక్స్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వి. ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలలో విషయం ఉందని భావిస్తున్నాను అని అన్నారు. ముస్లింలు కూడా గోవధకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర మతాల వారు తల్లిగా పూచించే గోవును చంపకూదని స్పష్టం చేశారు. ఇస్లాంలోనూ ‘హారామ్’ ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవధకు పాల్పడితే మూక హత్యలకు గురవుతారని, ప్రతి చోటా భద్రత కల్పించాలంటే కష్టతరం, కావున ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని సూచించారు.
గోవధకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని రిజ్వీ వ్యాఖ్యానించారు. మరోవైపు గోవధను మానుకుంటేనే మూకహత్యలు ఆగుతాయంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా, పలు వర్గాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.