ఈ ముస్లిం కుటుంబం మత సామరస్యానికి ప్రతీక..

263
Muslim family in Uttar Pradesh
- Advertisement -

ఒక ముస్లిం కుటుంబం పరమత సహనాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ ఒక్కటేనని చాటింది. ఉత్తరప్రదేశ్‌లోని చిలౌవా గ్రామంలో రుఖ్సార్ అనే అమ్మాయి తన పెండ్లి పత్రికపై హిందూ దేవుళ్లు సీతారాముల ఫొటోను ముద్రించి.. హిందూముస్లింలంతా ఒకటేనని చాటి చెప్పింది.

మతం పేరుతో మమ్మల్ని మేము వేరు చేసుకోం. హిందూముస్లింలతా కులమతాలకు అతీతంగా కలిసి ఉంటున్నాం మతసామరస్యాన్ని దేశానికి తెలియజేయాలనేది మా కోరిక. మా గ్రామంలో అందరం కలిసే ఉంటామని పెళ్లి కూతురు రుఖ్సార్ తల్లి బేబి తెలిపారు.

పెళ్లి కూతురు సోదరుడు మహ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. గ్రామస్థులంతా మా సోదరి వివాహ ఆహ్వాన పత్రికను స్వీకరించారు. ప్రజలంతా మా నిర్ణయానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని అన్నాడు.

- Advertisement -